AP News: ప్రకాశం జిల్లా టంగుటూరులో మహిళ దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టంగుటూరు వాణీనగర్ కు చెందిన బొడ్డపాటి హైమవతి హైస్కూల్ రోడ్డులో నివాసం ఉంటుంది. భర్త నెల్లూరు జిల్లా తడాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. పది రోజులకు ఒకసారిగా వచ్చి వెళుతుంటాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న హైమావతి రెండు రోజులుగా బయటికి రాకపోవడం, ఇంటికి బయట తాళం వేసి ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో వారి కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. వారు ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి లోపల హైమావతి నిర్జీవంగా పడి ఉంది.
AP News: చేతి మణికట్టు కత్తితో కోసి, మెడకు కండువాతో ఉచ్చు బిగించి ఉంది. అలానే బీరువా తలుపులు తెరచి ఉన్నాయి. ఇంట్లో సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.