Uttar pradesh: ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. షాపు బయట వస్తువులు ఉంచడంపై ఇద్దరు వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది. అదికాస్తా చిరిగి చిరిగా గాలివానగా మారింది. దీంతో ఇద్దరు వ్యాపారులు రద్దీ రోడ్డుపై పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఒకరినొకరు పిడి గుద్దులు గుద్దుకుంటూ చొక్కాలు చించుకుని దారుణంగా కొట్టుకున్నారు. ఔరయ్యా సదర్ కొత్వాలి ప్రాంతంలోని భోలే మందిర్ సమీపంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయాలోని భోలే మందిర్ సమీపంలో ఒక షాపు బయట వస్తువులు ఉంచడంపై అనిల్ కుమార్‌ను పక్కషాపులకు చెందిన వ్యాపారులు పవన్ కుమార్, సన్నీ, లక్కీ నిలదీశారు. దీంతో వాగ్వాదం రాజుకుంది. వివాదం ముదరడంతో భౌతిక దాడికి యత్నించారు. దీంతో ఇరు వర్గాలవారు కర్రలతో కొట్టుకున్నాడు.
Uttar pradesh: అనంతరం చొక్కాలు చించుకోవడంతోపాటు చెంపదెబ్బలు, పిడిగుద్దులు కురిపించుకున్నారు. రోడ్డుపై దొర్లుతో సినిమా టైప్‌లో ఫైట్ చేసుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన వీరిని స్థానికులు జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.
सामान दुकान के बाहर रखने को लेकर व्यापारियों का बीच सड़क पर कपड़े फाड़ युद्ध!#viralvideo #औरैया #UP pic.twitter.com/VgzliPJDds
— Social editor (@VishalGupt4492) November 24, 2024