Pushpa 2:పుష్ప 2 సినిమా ఎన్నో సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్నది. ఇటు తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషలతోపాటు, అటు హిందీలోనూ వసూళ్ల జాతర కొనసాగిస్తున్నది. హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ దశలో మహారాష్ట్రలో ఇదే సినిమా మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ను పట్టించింది. అదేమిటి.. కథేమిటో తెలుసుకుందాం..
Pushpa 2:మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ఓ మల్టీ ప్లెక్స్ సినిమా థియేటర్‌లో పుష్ప 2 సినిమా ప్రదర్శించబడుతుంది. 10 నెలలుగా పరారీలో ఉన్న మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ విశాల్ మేశ్రాం ఎలాగైనా ఈ పుష్ప 2 సినిమాపై ఆసక్తితో చూసేందుకు వస్తాడని అక్కడి పోలీసులు భావించారు. ఈ మేరకు వారికి సమాచారం కూడా ఉన్నది. దీంతో ఆ మల్టీ ప్లెక్స్ సినిమా థియేటర్ వద్ద కాచుకొని కూర్చున్నారు. విశాల్ కదలికలను పసిగడుతూ వేచి ఉన్నారు.
Pushpa 2:నిన్న అదే మల్టీ ప్లెక్స్ సినిమా థియేటర్‌కు వచ్చిన గ్యాంగ్‌స్టర్ విశాల్ మేశ్రాం ఎంచక్కా పుష్ప 2 సినిమాను చూడసాగాడు. అతను సినిమా చూస్తుండగానే చుట్టుముట్టిన పాంచ్ పావలీ పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అయిన విశాల్ మేశ్రాంపై రెండు హత్యలు, డ్రగ్స్ అక్రమ రవాణా, పలు హింసాత్మక ఘటనలతోపాటు మొత్తం 27 కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.