CV Anand: సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే ప్రశ్నలకు తాను సహనం కోల్పోయినప్పటికీ, ఆ వ్యాఖ్యలు తగనివి అని స్వీకరించారు. ఈ మేరకు జాతీయ మీడియాకు క్షమాపణ చెబుతూ, తాను చేసిన వ్యాఖ్యలను వాపస్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.
రేవతి మరణం థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన నిజాలు వెల్లడించేందుకు ఆదివారం పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు.
జాతీయ మీడియాపై వ్యాఖ్యలు:
మాట్లాడుతున్న సమయంలో, జాతీయ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తోందంటూ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. దీనిపై అక్కడ ఉన్న జాతీయ మీడియా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయగా, అనంతరం సీవీ ఆనంద్ తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు.
ఆనంద్ ట్వీట్:
“రెచ్చగొట్టే ప్రశ్నలకు ప్రతిస్పందిస్తూ సహనం కోల్పోయి చేసిన వ్యాఖ్యల గురించి నేను క్షమాపణ కోరుతున్నాను. జాతీయ మీడియాపై చేసిన వ్యాఖ్యలు తగనివి. నేను ఈ పొరపాటు పట్ల బాధపడి, జాతీయ మీడియా వద్ద క్షమాపణలు కోరుతున్నాను. మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తాను,” అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.