Pushpa 2:ఒకప్పుడు బాలీవుడ్ వాళ్లకు తెలుగు సినిమా అన్నా, ఇక్కడి నటులన్నా చులకన ఉండేది. మన సినిమాలను కనీసం పరిగణనలోకే తీసుకోకపోయేది. తొలి నాళ్ల నుంచే తెలుగు సినీ రంగానికి విశేష ప్రాధాన్యమున్నా, ఉత్తరాదికి చెందిన బాలీవుడ్ రంగం అంతగా గుర్తించేది కాదు. అలాంటిది మన తెలుగు నటులు, దర్శకులు సృష్టించిన సునామీతో బాలీవుడ్ గత కొన్నాళ్లుగా అతలాకుతలం అవుతున్నది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో బాలీవుడ్ దద్దరిల్లింది. మన తెలుగోడికి జేజేలు పలికింది.
Pushpa 2:పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటుతున్నది. తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డులు బ్రేక్ చేసిన ఈ సినిమా బాలీవుడ్‌లోనూ రికార్డ్‌ను తిరగరాసింది. అక్కడ ఇప్పటి వరకూ ఉన్న రికార్డును ఎవరూ అందుకోలేనంతగా దూసుకుపోయింది. బాలీవుడ్‌లో మూడు రోజుల్లోనే రూ.205 కోట్ల వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచినట్టు అక్కడి ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
Pushpa 2:బాలీవుడ్‌లో గతంలో జవాన్ రూ.180 కోట్లు, యానిమల్ రూ.176 కోట్లు, పఠాన్ రూ.161 కోట్లు వసూలు చేశాయి. ఆ సినిమా రికార్డులను తిరగరాసి, వాటిని వెనక్కి నెట్టారు. అలాగే హిందీలో తొలి మూడు రోజుల్లోనే రెండు రోజులు రూ.70 కోట్లు దాటిన తొలి చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ఈ సినిమాకు తొలి రోజు రూ.72 కోట్లు, రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజైన శనివారం రూ.74 కోట్లు సాధించి పెట్టింది. ఇలా హిందీలో పుష్ప 2 సినిమా రికార్డులు బ్రేక్ చేయడంతో తెలుగు నటుడు, దర్శకుడి సత్తా తెలిసిపోయింది.

