Warangal

Warangal: వరంగల్‌లో మైనర్లతో వ్యభిచారం – ముఠా అరెస్ట్

Warangal: వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాను నడిపిస్తున్న ప్రధాన నిందితురాలు ముస్కు లతను అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికలను టార్గెట్ చేసుకుని, వారికి మద్యం, గంజాయి అలవాటు చేసి లైంగిక వేధింపులకు గురి చేసే ఈ ముఠా దొరికిపోయింది.

పోలీసుల సమాచారం ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్న యువతి, తన ప్రేమికుడితో కలిసి ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసింది. మద్యం, గంజాయి బానిసగా మార్చి, అనంతరం నర్సంపేటకు తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడి జరిపారు. ఈ ఘటన మార్చి 11న జరిగింది. బాలికను కిడ్నాప్ చేసి, గంజాయి తాగించి, అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Also Read: Surya Grahan 2025: మార్చి 29న సూర్యగ్రహణం.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు

Warangal: బాలికను మిస్సింగ్‌గా గుర్తించి, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ములుగు క్రాస్‌రోడ్ వద్ద బాలికను కనుగొని, ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితురాలు ముస్కు లతతో పాటు, మరో మైనర్ నిందితురాలు, ఆమె లవర్ అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్‌లను అరెస్టు చేశారు.

అత్యాచార ఘటనను వీడియో రికార్డ్ చేసి, బాలికను బెదిరించినట్లు తేలింది. పోలీసులు లత ఇంటి వద్ద నుంచి 4,300 కండోమ్ పాకెట్లు, ₹7,500 నగదు, ఒక బ్రేజా కారు, నాలుగు మొబైల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మైనర్ల భద్రత కోసం తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు సోషల్ మీడియా ద్వారా మోసగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *