Nani-Sujeeth: నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎందుకో ఏమో ఈ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం సుజీత్ పవన్ కల్యాణ్ తో ‘ఓజి’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి అవుతుంది. అటు నాని కూడా తన సొంత సంస్థ లో శైలేష్ కొలను తో ‘హిట్3’ ని యమ ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నాడు. దీనిని మే 1, 2025లో రిలీజ్ చేయబోతున్నట్లు దీపావళి సందర్భంగా ప్రకటించాడు నాని ఆ తర్వాత ‘దసరా’ దర్శకుడుతో సినిమా చేయబోతున్నాడు. సుజిత్ తో చేయాలనుకున్న సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో స్టైలిష్ గా ఉంటుందట.
ఇది కూడా చదవండి: Pushpa 3: ‘పుష్ప3’కి లీడ్ ఇవ్వనున్న మరో స్టార్!?
Nani-Sujeeth: దాంతో ఈ సినిమాను ఇప్పుడు తనతో ‘శ్యామ్ సింగ రాయ్’ తీసిన వెంకట్ బోయినపల్లి బ్యానర్ లో చేయబోతున్నాడట. దానయ్య కు మరో సినిమా చేస్తానంటున్నాడు నాని. ఇదిలా ఉంటే గతంలో వెంకట్ బోయిన పల్లి బ్యానర్ లో చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ ముందుగా సితార సంస్థలో చేయాలనుకున్నారు. అయితే బడ్జెట్ వర్కవుట్ కాదని సితార వెనుకాడటంతో వెంకట్ బోయినపల్లితో చేశారు. యాదృచ్ఛికంగా ఇప్పుడు తనతో చేయబోయే రెండో సినిమా కూడా అలాగే బడ్జెట్ ఇష్యూస్ తో వెంకట్ దరి చేరింది. మరి ఈ సినిమా కూడా ‘శ్యామ్ సింగ రాయ్’ లాగే నాని, వెంకట్ కి మంచి పేరు తెస్తుందేమో చూడాలి.