ap news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల మధ్య గురువారం జరిగిన గొడవ సంచలనంగా మారింది. మూడు కాలేజీల విద్యార్థులు ఒకరికొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు సమీపంలోని మూడు ఇంజినీరింగ్ కళాశాలల బీటెక్ విద్యార్థులు ఈ గొడవకు దిగారు. గ్రూపులుగా ఏర్పడిన విద్యార్థులు దాడులు చేసుకున్నారు.
ap news: ఈ దాడిలో ఏ1 గ్లోబల్, ఇందిరా, జార్జి ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నట్టు తెలిసింది. అయితే గొడవ ఎందుకు జరిగిందనే విషయం ఇంకా బయటకు రాలేదు. విద్యార్థుల దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో సమీపంలో పలువురు భయాందోళనకు గురయ్యారు.