Pro Kabaddi Season 11: కబడ్డి ప్రియులను విశేషంగా అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ కు అదిరే ఆరంభం దక్కింది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టైటాన్స్ 37-29 తేడాతో బెంగళూరు బుల్స్ పై ఘన విజయం సాధించింది. రైడింగ్ లో కెప్టెన్ పవన్ సెహ్రావత్ 13 పాయింట్లు సాధించగా, ట్యాక్లింగ్ లో కిషన్ 6 పాయింట్లతో సత్తా చాటాడు. కొత్త కోచ్ క్రిషన్ కుమార్ పక్కా వ్యూహంతో, సొంతగడ్డపై దూకుడుగా ఆడిన టైటాన్స్ ఫలితం సాధించింది. బాలీవుడ్ నటీనటులు విద్యాబాలన్, కార్తీక్ ఆర్యన్ ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
PKL సీజన్ 11 కెప్టెన్లు, కోచ్‌లు.. యజమానులు
| జట్టు | కెప్టెన్ | కోచ్ | యజమాని |
| బెంగాల్ వారియర్జ్ | ఫజెల్ అత్రాచలి | ప్రశాంత్ సర్వే | కాప్రి స్పోర్ట్స్ |
| బెంగళూరు బుల్స్ | పర్దీప్ నర్వాల్ | రణధీర్ సింగ్ షెరావత్ | WL లీగ్ ప్రైవేట్. లిమిటెడ్ |
| దబాంగ్ ఢిల్లీ | నవీన్ కుమార్ మరియు అషు మాలిక్ | జోగిందర్ నర్వాల్ | రాధా కపూర్ |
| గుజరాత్ జెయింట్స్ | నీరజ్ కుమార్ | రామ్ మెహర్ సింగ్ | అదానీ విల్మార్ లిమిటెడ్ |
| హర్యానా స్టీలర్స్ | జైదీప్ దహియా | మన్‌ప్రీత్ సింగ్ | JSW గ్రూప్ |
| జైపూర్ పింక్ పాంథర్స్ | అర్జున్ దేశ్వాల్ | సంజీవ్ బలియన్ | అభిషేక్ బచ్చన్ |
| పాట్నా పైరేట్స్ | శుభమ్ షిండే | నరేందర్ రేడు | రాజేష్ షా |
| పుణేరి పల్టన్ | అస్లాం ఇనామ్దార్ | బీసీ రమేష్ | ఇన్సూర్‌కోట్ స్పోర్ట్స్ ప్రై.లి. Ltd |
| తమిళ్ తలైవాస్ | సాగర్ రాఠీ | ఉదయ కుమార్ మరియు ధర్మరాజ్ చెరలతన్ | మాగ్నమ్ స్పోర్ట్స్ ప్రై. Ltd |
| తెలుగు టైటాన్స్ | పవన్ కుమార్ సెహ్రావత్ | క్రిషన్ కుమార్ హుడా | వీర క్రీడలు |
| యు ముంబా | సునీల్ కుమార్ | ఘోలమ్రేజా మజందరాణి | యునిలేజర్ వెంచర్స్ ప్రై.లి. లిమిటెడ్ |
| UP యోధాలు | సురేందర్ గిల్ | జస్వీర్ సింగ్ |

