Priyanka Gandhi: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) మరియు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అంశాలపై లోక్సభలో రెండోరోజు వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. జమ్మూకశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని కేంద్రం చెబుతోందని, అలా అయితే ఉగ్రదాడి ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు.
భద్రతా విఫలమైందని స్పష్టంగా పేర్కొన్న ప్రియాంక, పహల్గాంలో పర్యాటకుల వద్ద భద్రతా సిబ్బంది ఎందుకు లేరని నిలదీశారు. “ఇది నిఘా సంస్థల వైఫల్యమా? లేక కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా?” అంటూ ప్రభుత్వంపై కఠిన ప్రశ్నలు సంధించారు.
“ఏప్రిల్ 22న జరిగిన దాడికి బాధ్యత ఎవరి మీద? హోంమంత్రిదా? లేక ప్రధానమంత్రిదా?” అంటూ ఆమె వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. టీఎఆర్ఎఫ్ (TRF) వరుస దాడులు చేస్తున్నప్పటికీ, కేంద్ర హో

