Priyanka Chopra: ప్రియాంక చోప్రా తన 43వ జన్మదినాన్ని బహామాస్‌లో భర్త నిక్ జోనస్, కూతురు మాలతి మేరీతో సంబరాలు చేసుకున్నారు. బీచ్‌లో, యాట్‌పై ఆమె స్టైలిష్ లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. మాయ్గెల్ కొరోనెల్ బ్రాండ్‌కు చెందిన ఎరుపు రంగు మ్యాక్సీ డ్రెస్‌లో ఆమె సొగసు మరింత ఆకట్టుకుంది. ఈ డ్రెస్‌ను సింపుల్ యాక్సెసరీస్, ఓవర్సైజ్డ్ సన్‌గ్లాసెస్‌తో జతచేసి ఆకర్షణీయంగా కనిపించారు. అలాగే, ఆస్ట్రేలియా బ్రాండ్ అలెమైస్కు చెందిన రొమాంటిక్ ప్రింట్స్‌తో కూడిన షర్ట్‌లోనూ ప్రియాంక సందడి చేశారు. వైట్, యెల్లో బికినీల్లో బీచ్‌పై ఆమె చలాకీతనం అందరినీ ఆకట్టుకుంది. పర్పుల్ హాల్టర్ నెక్లైన్ డ్రెస్, మెటాలిక్ స్విమ్‌సూట్, గ్రీన్-వైట్-బ్రౌన్ ప్రింటెడ్ షర్ట్‌లో ఆమె ఫ్యాషన్ ఎంపికలు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచాయి. బీచ్ వైబ్స్, ఫ్యామిలీ మూమెంట్స్‌తో ఈ వెకేషన్ అభిమానులకు ఫ్యాషన్ ట్రీట్ గా నిలిచింది.
View this post on Instagram

