Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురు, శుక్రవారాల్లో హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. రెండురోజులు జరిగే వేర్వేరు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఆమె బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం 6:20 గంటల నుంచి 7:10 గంటల వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7:20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఇదేరోజు రాత్రి ఆమె రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు.
Droupadi Murmu: శుక్రవారం ఉదయం 10:20 గంటలకు శిల్పకళా వేదికలో లోక్‌మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:05 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు పయనమై ఢిల్లీకి వెళ్లనున్నారు.