Prashanth kishor: ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌కు అకస్మాత్తుగా గాయాలయ్యాయి. బీహార్ రాష్ట్రంలోని పాట్నా- ఆరా జిల్లాలో బద్లావ్ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సభకు ముందు జరిగిన రోడ్ షో సమయంలో గాయానికి గురయ్యారు. రోడ్డు షో సందర్భంగా కారులో నుంచి బయటకు వచ్చి వంగిన సమయంలో పక్కటెముక భాగంలో గాయమైంది. దీంతో వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Prashanth kishor: త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన విరామం లేకుండా వివిధ సభల్లో పాల్గొంటూ వస్తున్నారు. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కూటమికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ మేరకు ఎన్నికల ముందస్తు ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయనకు గాయాలయ్యాయి.

