Pragya Jaiswal: తెలుగు చిత్రసీమలో ‘కంచె’ సినిమాతో అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తన తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె అందం, నటనా ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టగా, వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి. ‘నక్షత్రం’, ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ భామ, తాజాగా బాలకృష్ణ సరసన ‘డాకు మహారాజ్’లో నటించి మరోసారి అలరించింది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రగ్యా ప్రస్తుతం కొన్ని కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బికినీలో ఆకర్షణీయంగా కనిపించిన ఈ చిత్రాలు కుర్రకారును మెస్మరైజ్ చేస్తున్నాయి. ప్రగ్యా బికినీ పిక్ చూస్తే ఆమె ఎక్స్ పొజింగ్ ఎంత పీక్స్ కి చేరిందో స్పష్టంగా అర్ధమవుతుంది. బాత్‌రూమ్‌లో సెల్ఫీ తీసుకున్న బికినీ ఫోటో నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. ఈ రేంజిలో ఇంతవరకు ఏ హీరోయిన్ అందాల ప్రదర్శన చెయ్యలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సినిమాలతో రాని గుర్తింపు ఇలా గ్లామర్ చూపిస్తూ తెచ్చుకుంటుంది ప్రగ్యా. ఆమె తదుపరి చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram