Peddi: సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ పెద్ది సినిమా పాటలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బుచ్చిబాబు పెద్ది కోసం ఐదు కీలక సన్నివేశాలను రెహమాన్‌కు వివరించారట. ప్రతి సన్నివేశానికి మూడు రిఫరెన్స్ పాటలను జోడించి, తన సంగీత రుచిని చాటుకున్నారని రెహమాన్ అన్నారు. బుచ్చిబాబు సంగీత అభిరుచిని చూసి రెహమాన్ ఆశ్చర్యపోయారట. బుచ్చిబాబు ‘ఉప్పెన’ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటిన విషయం తెలిసిందే. ఆ చిత్రం యువతను ఆకట్టుకుని, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Also Read: Jacqueline Fernandez: మ్యూజిక్ ఆల్బమ్స్‌తో బౌన్స్ బ్యాక్ అవుతున్న హాట్ బ్యూటీ!
Peddi: ఇప్పుడు రెహమాన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం బుచ్చిబాబుకు మరో మైలురాయి. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు దర్శకత్వం కలిస్తే ఎలాంటి మాయాజాలం సృష్టిస్తాయోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు ఈ చిత్రంతో కూడా తనదైన ముద్ర వేస్తారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.