Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు! వరుస సినిమాలతో బిజీ మోడ్‌లో ఉన్న రెబల్ స్టార్, మారుతితో ‘ది రాజా సాబ్’ చేస్తూనే, హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ అనే భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ సినీ వర్గాల్లో హైప్ తెప్పించింది. అయితే, ట్విస్ట్ ఏంటంటే.. ‘ఫౌజీ’ సెట్స్‌లో హను స్టైల్‌కి ప్రభాస్ ఫిదా అయిపోయాడట! దీంతో సినిమా పూర్తి కాకముందే, హనుతో మరో బిగ్ బడ్జెట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని బజ్ వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఇప్పుడు డబుల్ ధమాకా కోసం ఎగ్జైట్ అవుతున్నారు.‘ఫౌజీ’లో ప్రభాస్ సరికొత్త లుక్‌తో సర్‌ప్రైజ్ చేయనున్నాడు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో సంచలనం కావొచ్చని సినీ విశ్లేషకులు జోష్యం చెబుతున్నారు. హను-ప్రభాస్ కాంబో రెండు భారీ చిత్రాలతో అభిమానులకు పండగ వాతావరణం పరిచేలా కనిపిస్తోంది. త్వరలోనే మరో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వస్తుందని టాక్ నడుస్తుండగా, ప్రభాస్ మేనియా మరింత పీక్స్‌కి వెళ్లనుంది. ఇది హిట్ కొడితే.. బాక్సాఫీస్ వణకాల్సిందే!
