Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తన లేటెస్ట్ చిత్రాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే ఆయన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ చిత్ర షూటింగ్‌ను విజయవంతంగా ముగించారు. ఈ మధ్య కాలంలో పవన్ తెల్లని దుస్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తూ అభిమానులకు అలవాటైన లుక్‌ను కొనసాగించారు. కానీ, ఊహించని విధంగా టీ-షర్ట్, షార్ట్స్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Also Read: The Rajasaab: ‘ది రాజా సాబ్’ ఫీవర్: ప్రభాస్ హై-వోల్టేజ్ డబ్బింగ్ స్టార్ట్!
Pawan Kalyan: ఈ కొత్త లుక్‌ను చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా గత రోజుల వింటేజ్ వైబ్స్‌ను గుర్తు చేసుకున్నారు. కొందరు ఈ ఫొటోలు పాతవని అనుకున్నప్పటికీ, అవి తాజావేనని తేలడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో కుంభమేళా సమయంలో పవన్ లుక్స్ పై ట్రోలింగ్ జరిగింది. కానీ తాజా లుక్స్ తో ఆయన దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం, పవన్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎలాంటి సర్‌ప్రైజ్‌లతో వస్తుందో చూడాలి!