Jagan World Record

Jagan World Record: తన నలుపు మర్చిపోయిన జగన్‌.. బయటపెట్టిన టీడీపీ

Jagan World Record: అధికారం కోల్పోయాక జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకే బూమరాంగ్‌గా మారుతుంటాయి. తెనాలి పర్యటనలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్, తనపై ఉన్న కేసుల సంగతి మరచిపోయారు. దీంతో టీడీపీ సోషల్ మీడియా యంత్రాంగం జగన్‌పై సునామీలా విరుచుకుపడి, జగన్‌ కేసుల చిట్టాను, నేర చరిత్రలో ఆయన బద్ధలు కొట్టిన రికార్డులను బయటపెడుతోంది. 3,452 కోర్టు వాయిదాలతో ప్రపంచ రికార్డు సృష్టించిన జగన్.. వేల కోట్లు లాయర్లకు ఫీజులుగా సమర్పించుకున్నారంటూ ట్రోల్స్‌ చేస్తోంది.

రాజకీయంగా అస్థిరంగా ఉన్న సమయంలో, జనంలోకి వెళితే ఆదరణ పెరుగుతుందని జగన్ భావించారు. కానీ, ఆయన పర్యటనలు పార్టీకి ఊరటనివ్వకపోగా, మరింత నష్టాన్ని తెచ్చి పెడుతున్నాయి. ఇటీవల తెనాలి పర్యటనలో సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డ జగన్, ఆయనపై 21 కేసులున్నాయని, అలాగని చంద్రబాబును రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టొచ్చా అంటూ గొప్ప మానవతా వాదిలా తన ధర్మ సందేహాన్ని వెలిబుచ్చారు. జగన్‌ తెనాలికెళ్లి చేసింది రౌడీ షీటర్లకు మద్ధతు ప్రకటించడం. ఇదే పార్టీకి పెద్ద పరువు తక్కువ పని అంటూ వైసీపీ నేతలే వాపోతున్న పరిస్థితి. అంతటితో ఆగకుండా.. చంద్రబాబును ఆ రౌడీ షీటర్లతో పోల్చడం జగన్‌ చేసిన మరో పెద్ద తప్పు అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ విచిత్రం ఏమంటే.. చంద్రబాబుపై ఉన్న కేసుల్లో ఒకట్రెండు మినహా మిగతావన్నీ జగన్‌ హయాంలో పనికట్టుకుని పెట్టించినవే. ఆ విషయం జగన్ మరచినట్లున్నారు. దీంతో తమ్ముళ్లకు టార్గెట్‌ అయ్యారు.

Also Read: Nara Lokesh: వైకాపా నేతల భాషేంటి.. ప్రవర్తనేంటి?: లోకేశ్‌

Jagan World Record: టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. జగన్‌పై నమోదైన కేసుల జాబితాను బయటపెట్టి, సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఫలితం? వైసీపీ శ్రేణులే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాయి. టీడీపీ వెల్లడించిన సమాచారం ప్రకారం, జగన్‌పై 31 కేసులు, అందులో 7 ఈడీ, 11 సీబీఐ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో 3,452 కోర్టు వాయిదాలతో జగన్ ప్రపంచ రికార్డు సృష్టించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ కేసుల కోసం గంటకు 12 నుండి 25 లక్షల రూపాయలు చొప్పున న్యాయవాదులకు ఫీజుగా చెల్లిస్తున్నారని, ఇప్పటివరకు సుమారు 6,904 కోట్ల రూపాయలు లీగల్ ఫీజుల కోసం ఖర్చు చేశారని టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఇంకా, జగన్ బెయిల్‌పై 5,000 రోజులకు పైగా బయట తిరుగుతున్నారని, కొన్ని కేసులు ఇప్పటికీ ట్రయల్‌కు కూడా రాలేదని టీడీపీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, జగన్ రాజకీయంగా ఇరుక్కుపోయారు. చంద్రబాబుపై తాను చల్లిన కేసుల బురద గురించి చెబుతున్న జగన్… తన కేసుల సునామీ గురించి మరచిపోయారంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

ALSO READ  Prabhas Fauji: ప్రభాస్ ఫౌజీ లో బాలీవుడ్ యాక్షన్ హీరో!

జగన్ వ్యాఖ్యలు వైసీపీకి మరింత నష్టం తెచ్చాయని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా జగన్ వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్‌ను మరింత దెబ్బతీశాయని అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ, మరోవైపు కేసుల సముద్రంలో కొట్టుకుపోతున్న జగన్, ఈ రాజకీయ క్రీడలో ఎంతవరకు నిలబడతారనేది ప్రశ్నార్థకమే అంటున్నారు అనలిస్టులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *