Nara Lokesh

Nara Lokesh: వైకాపా నేతల భాషేంటి.. ప్రవర్తనేంటి?: లోకేశ్‌

Nara Lokesh: మహిళల గురించి వైకాపా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ఘాటు స్పందన తెలిపారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జలను తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న మహిళలను అవమానించడం ఏంటి? అంటూ నిలదీశారు. “ఏం మాట్లాడుతున్నారు వైకాపా నేతలు? మహిళలపై ఈ స్థాయి మాటలవేడి అవసరమా? ఎవరైనా తమకు జరిగిన అన్యాయంపై నిరసన తెలిపితే వారికి సంకరజాతి అనడం ఎంతవ వరకు సమంజసం?” అంటూ లోకేష్ ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన, వైసీపీ నాయకుల భాషా ప్రమాణాలను తీవ్రంగా విమర్శించారు. ఒకప్పుడు సాక్షి మీడియా జర్నలిస్టులు కూడా మహిళలపై వేశ్యలుగా కామెంట్లు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ సంస్కృతి మళ్లీ కనబడుతోందని వ్యాఖ్యానించారు. “మహిళల్ని కించపరిచేలా మాట్లాడటం వైకాపాకు అలవాటే అయిపోయిందా? జగన్‌ తన తల్లి, చెల్లిని పార్టీ నుంచి వెళతారని నెగలాడిన తరహా వ్యవహారాన్ని వారే ఆదర్శంగా తీసుకుంటున్నట్టుంది,” అని లోకేష్ మండిపడ్డారు. మహిళలపై ఇంకెవరైనా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read: CM Chandrababu: సాధనల దిశగా స్వర్ణాంధ్ర ప్రయాణం: సీఎం చంద్రబాబు

Nara Lokesh: ఇటు పార్వతీపురంలో జరిగిన “షైనింగ్ స్టార్స్ అవార్డ్స్-2025” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్, పదో తరగతి మరియు ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో 95 మంది పదో తరగతి విద్యార్థులు, 26 మంది ఇంటర్మీడియట్ ప్రతిభావంతులు అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల స్థాయిని ప్రైవేటు రంగానికంటే మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. రాబోయే నాలుగేళ్లలో ఈ మార్పులు అద్భుతమైన ఫలితాల్ని ఇస్తాయి” అని చెప్పారు.”అహర్నిశలు పనిచేస్తున్నాం, విద్యార్థులు కష్టపడి చదవాలి, మేము చేయూత ఇస్తాం. మీ భవిష్యత్తు నిర్మాణానికి మీరు చేసిన ప్రయత్నం ఎంతో కీలకం” అని విద్యార్థులకు సూచనలు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kannappa Movie: అద్భుతంగా ఉన్న 'శివ శివ శంకర'.. మంచు విష్ణు కన్నప్ప నుండి సాంగ్ రిలీజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *