The Rajasaab: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ హీరోగా కమర్షియల్ హిట్‌మేకర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ సినిమా పై అభిమానుల్లో హైప్ ఆకాశాన్ని తాకుతోంది! ప్రస్తుతం టీమ్ పోస్ట్-ప్రొడక్షన్ పనులను జెట్ స్పీడ్‌లో పూర్తి చేస్తోంది. ఈ వారంలో ప్రభాస్ తన పాత్రకు తెలుగుతో పాటు హిందీలో కూడా స్వయంగా డబ్బింగ్ చేయనున్నారని టాక్. ఇది ఫ్యాన్స్‌లో జోష్‌ను మరింత పెంచింది!
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లాంటి స్టార్ హీరోయిన్లు ఈ చిత్రంలో మెరవనున్నారు. అలాగే, బాలీవుడ్ లెజెండ్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీత మాంత్రికుడు తమన్ ఈ చిత్రానికి బీట్స్ అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ బిగ్ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నారు.
Also Read: Megastar: జెట్ స్పీడ్‌లో మెగాస్టార్!
The Rajasaab: షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ పనులు రెండూ ఒకేసారి ఊపందుకున్నాయి. ఈ సినిమా అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అభిమానులు థియేటర్లలో ఈ విజువల్ ఫీస్ట్‌ను చూసేందుకు రెడీగా ఉన్నారు. మరి, ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేయనుందో చూడాలి.