Vijay Deverakonda

Vijay Deverakonda: శౌర్య తో దేవరకొండ.. మూవీ టెక్నీషియన్స్ గురించి తెలుసుకుంటే గూస్ బంప్స్ పక్క

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రెస్ట్ లేకుండా షూటింగ్‌లు చేస్తున్న దేవరకొండ ఇప్పుడు ఇంకో సినిమాకి ఓకే చెప్పారు. ‘హాయ్ నాన్న’ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శౌర్యతో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్‌గా ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసి ప్రకటించింది. ఇందులో సినిమాకి సంబంధించిన ముఖ్యమైన టీమ్ మెంబర్స్‌ని పరిచయం చేసింది.

ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా ALEJANDRO MARTINEZ ని తీసుకున్నారు; ఈయన పలు హాలీవుడ్ మూవీస్‌కి DOPగా చేశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్‌గా Hesham Abdul Wahabని తీసుకున్నారు; ఈయన గతంలో డైరెక్టర్‌తో ‘హాయ్ నాన్న’, దేవరకొండతో ‘ఖుషి’ సినిమాలు చేశారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా Suresh Selvarajan, గ్రాఫిక్స్ సూపర్ వైజర్‌గా Eric Durstని తీసుకున్నారు; ఆయన గతంలో Snowpiercer, Gods of Egypt (2016), మరియు Ghost Rider: Spirit of Vengeance (2011) అనే సినిమాలకు VFX సూపర్ వైజర్‌గా పనిచేశారు. ఎడిటర్‌గా ప్రవీణ్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా Sachin Lovalekarని తీసుకున్నారు; ఆయన Tumbbad (2018), Sam Bahadur (2023) మరియు Paan Singh Tomar (2012) వంటి సినిమాలు చేశారు.

పెళ్లి తర్వాత కూడా రెస్ట్ లేకుండా సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు దేవరకొండ. రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityan) తో ‘రణబలి’ (Ranabaali) అనే సినిమా చేస్తున్నారు; ఇందులో తన భార్య రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు దిల్‌రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నారు; ఇందులో కీర్తి సురేష్ నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *