90’s Web Series

90s Web Series: పాన్ ఇండియా రేంజికి #90’s సిరీస్!

90s Web Series:  ప్రముఖ తెలుగు వెబ్ సిరీస్ #90’s మరో ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈటీవీ విన్‌లో నేరుగా ప్రీమియర్ అయిన ఈ ఫ్యామిలీ సిరీస్ భారీ విజయం సాధించింది. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రేక్షకుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Andhra King Taluka OTT: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

యువ దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన #90’s వెబ్ సిరీస్ గతంలో ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అయి సూపర్ హిట్ అయింది. శివాజీ, వాసుకి, మౌళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ 90వ దశకం నాస్టాల్జియాను అద్భుతంగా పంచి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, జ్ఞాపకాలతో నిండిన ఈ సిరీస్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను తమ ప్లాట్‌ఫాంలోకి తీసుకొచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి పాన్ ఇండియా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచింది. దీంతో దక్షిణ భారత భాషలతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ఈ సిరీస్‌ను ఆస్వాదించే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఈ సిరీస్ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ ప్లాట్ఫామ్ కావడంతో ఈ సిరీస్ కి ఇంకా క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. మరి దీనికి గ్లోబల్ రికగ్నేషన్ వస్తుందో లేదో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *