Copper Vessel Water: రాగి సీసా లేదా పాత్రలో నీటిని త్రాగడం మన సంస్కృతిలో ఒక భాగం. దీనిని దక్షిణాసియాలో చాలా కాలంగా ఆచరిస్తున్నారు. రాగి బాటిల్ వాటర్ తాగడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని జనం నమ్ముతారు. ఈ రోజుల్లో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పాత పద్ధతులను కొత్తగా అమలు చేస్తున్నారు. రాగి సీసాలో నీళ్లు తాగే వారి సంఖ్య పెరిగింది.
రాగికి యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను తొలగిస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. జీర్ణక్రియలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ప్రతిరోజూ రాగి నీటిని తాగబోతున్నట్లయితే.. కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది.
రాగి సీసా ఉపయోగించే ముందు ఇవి గుర్తుంచుకోవాలి:
మితమైన వినియోగం :
రాగి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అధిక వినియోగం ప్రమాదకరం. ఇది కాపర్ టాక్సిసిటీకి దారి తీస్తుంది. మీరు వికారం, వాంతులు, అతిసారం, కాలేయం దెబ్బతినడం వంటి లక్షణాలను అనుభవించవచ్చు. కాబట్టి రాగి బాటిల్ నీటిని పొదుపుగా వాడాలి. ప్రతిరోజూ రాగి బాటిల్ వాటర్ తాగడం మానుకోవాలి.
ఇది కూడా చదవండి: Robo Doctor: డాక్డర్ రోబో సాబ్ వచ్చేశాడు.. చిటికెలో ఆపరేషన్ పూర్తి చేస్తాడు..!
నాణ్యత:
మీరు మంచి నాణ్యమైన రాగి సీసాని కొనుగోలు చేయడం ముఖ్యం. చౌకైన సీసాలో కొన్ని ఇతర మెటల్ ఉంటుంది. అవి నీటిలో కరిగి ఆరోగ్యానికి హాని చేసే అవకాశాలుంటాయి. రాగి బాటిల్‌ను కొనుగోలు చేసే ముందు నాణ్యతను పరిశీలించండి.
పరిశుభ్రత :
బాటిల్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. సీసాలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. బాటిల్‌ను శుభ్రంగా ఉంచడానికి నిమ్మరసం, ఉప్పు మిశ్రమాన్ని లేదా ప్రత్యేక కాపర్ క్లీనర్‌ను ఉపయోగించాలి. ముతక స్క్రబ్బర్ ఉపయోగించి సీసాని స్క్రబ్ చేయవద్దు.
బాటిల్ వీటిని ఉపయోగించొద్దు :
రాగి సీసాలో నీటిని మాత్రమే నిల్వ చేయండి. పండ్ల రసం, నిమ్మరసం అందులో వేయకూడదు. పండ్ల రసం లేదా ఆమ్లం రాగితో కలిపి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
అలెర్జీ హెచ్చరి
రాగి పాత్రలో నీటిని తాగే ముందు మీకు దాని వల్ల అలెర్జీ ఉందో లేదో తెలుసుకోండి. చాలామందికి రాగి అంటే ఎలర్జీ. ఇటువంటి వారు రాగి పాత్రలోని నీరు తాగితే ఎలర్జీ వస్తుంది.