Pooja Hegde

Pooja Hegde: సినిమా ఫ్లాప్ అయినప్పటికీ పూజా హెగ్డే భారీ పారితోషికం!

Pooja Hegde: పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్ముడు.. తమిళ చిత్ర పరిశ్రమలోనూ ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. నాగ చైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ.. ఈ తరువాత వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి హృతిక్ రోషన్ తో మొహెంజో దారో సినిమాలో నటించింది. కానీ అది పరాజయం కావడంతో మళ్లీ టాలీవుడ్ వైపు తిరిగి వచ్చేసింది.

ఇక్కడ అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథం చిత్రం పూజ కెరీర్‌నే మార్చేసింది. మళ్లీ ఆమె వెనక్కి తిరిగి చూసే రోజు రాలేదు. ఆ తరువాత మహర్షి, అలా వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అరవింద్ సమేత వంటి వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీంతో తెలుగులో అందరూ పూజా హెగ్డేను గోల్డెన్ లెగ్ అని ప్రశంసించారు. అయితే 2021 నుండి, పూజను దురదృష్టం వెంటాడింది.

Also Read: Therachaapa: కార్తీక్ రత్నం,హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదుగా “తెరచాప” టీజర్ లాంచ్

Pooja Hegde: రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో తమిళ్ లో విజయ్ తో కలిసి నటించిన బీస్ట్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా పూజా హెగ్డే ఈ చిత్రం ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను అయితే సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన రెట్రో చిత్రంలో పూజా హెగ్డే సూర్యతో కలిసి నటించింది. అయితే సినిమాకు మాత్రం హిట్ టాక్ రాలేదు. ఈ సినిమా కోసం సూర్య 40 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూజా హెగ్డేకు రూ.5 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారని సమాచారం. ఇటీవల ఆమె చేసిన సినిమాలు వరుసగా పరాజయాలు అయినప్పటికీ ఆమె డిమాండ్, క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదని అర్థం అవుతుంది అన్నమాట.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *