Ponguleti srinivas: భూభారతి చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఈ దిశగా రెవెన్యూ శాఖపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో రీసర్వే విజయవంతంగా పూర్తి కాగా, మిగిలిన 408 గ్రామాల్లో రీసర్వే కోసం చర్యలు ప్రారంభమయ్యాయి. భూ హద్దులను ఖరారు చేయడానికి యజమానులకు నోటీసులు జారీ చేశారు.
అభ్యంతరాలను పరిష్కరించేందుకు గ్రామసభల ద్వారా చర్చలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్‌లో భూ వివరాలు మరింత పారదర్శకంగా ఉండేందుకు ప్రతి భూమికి ప్రత్యేకంగా భూదార్ నెంబర్ కేటాయిస్తామని వెల్లడించారు.
భూ విక్రయాల విషయంలో ప్రతి లావాదేవీకి మ్యాప్ జత చేయడం తప్పనిసరి చేస్తామని, సరికొత్త రీసర్వే ప్రక్రియలో భూములకు కొత్త సర్వే నెంబర్లు కూడా కేటాయిస్తామని మంత్రి తెలిపారు.

