Ponnam Prabhakar:

Ponnam Prabhakar: మంత్రులు అడ్లూరి, పొన్నం వివాదం స‌మ‌సిన‌ట్టేనా? అడ్లూరిపై వ్యాఖ్య‌ల‌కు పొన్నం క్లారిటీ

Ponnam Prabhakar: మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్‌పై ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌రో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్పందించారు. తాను ఎవ‌రిని ఉద్దేశించి అన‌లేద‌ని, అడ్లూరి పేరును తాను ప్ర‌స్తావించ‌లేద‌ని నిన్న వివ‌ర‌ణ ఇచ్చిన పొన్నం.. తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌కు నొచ్చుకున్న మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ కూడా సీరియ‌స్ అయ్యారు. మంత్రి పొన్నం బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, లేకుంటే తీవ్ర ప‌రిణామాల‌ను ఆయ‌న ఎదుర్కొంటార‌ని హెచ్చ‌రించారు.

Ponnam Prabhakar: ఈ ప‌రిణామాల‌తో ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ బుధ‌వారం (అక్టోబ‌ర్ 8) స్పందించారు. అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ త‌న‌కు సోద‌రుడితో స‌మాన‌మ‌ని, తమ ఇద్ద‌రికీ 30 ఏళ్ల నుంచి అనుబంధం ఉన్న‌ద‌ని, త‌మ ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం, స్నేహ‌బంధం ఎప్ప‌టికీ కొన‌సాగుతుంద‌ని పొన్నం చెప్పారు. తాను అడ్లూరి గురించి వ్య‌క్తిగ‌త ప్ర‌స్తావన తేలేద‌ని, ఒక‌వేళ ఆయ‌న నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను అని చెప్పారు.

Ponnam Prabhakar: అట్ట‌డుగు స్థాయి నుంచి వ‌చ్చిన వ్య‌క్తిగా, బీసీ నేత‌గా త‌న‌కు వేరొక‌రిపై దురుద్దేశాలు ఉండ‌బోవ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తేల్చి చెప్పారు. రాజ‌కీయ దుర్దేశంతో కొంద‌రు త‌న‌ వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని తెలిపారు. దాంతో ఏర్ప‌డిన అపార్థాల వ‌ల్ల అన్న‌లాంటి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ నొచ్చుకున్నార‌ని తెలిసి తీవ్రంగా విచారిస్తున్నాన‌ని చెప్పారు.

Ponnam Prabhakar: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల‌ను ముందుకు తీసుకుపోవ‌డంలో, త‌మ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ నాయ‌క‌త్వంలో సామాజిక న్యాయ సాధ‌న‌లో, ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం తామిద్ద‌రం క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగుతామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో తాము ఐక్యంగా ఉండి ప‌నిచేస్తామ‌ని తెలిపారు.

Ponnam Prabhakar: ఇదిలా ఉండ‌గా, మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ మ‌ధ్య ఎపిసోడ్‌ను ఫుల్‌స్టాప్ పెట్టేందుకు టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్ చొర‌వ తీసుకున్నారు. మ‌ధ్యాహ్నం ఆ మంత్రులిద్ద‌రితో మ‌హేశ్‌కుమార్‌గౌడ్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆహ్వానించారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచ‌న‌తో ఆయ‌న ఈ చొర‌వ తీసుకున్నారు. ఇద్ద‌రు మంత్రుల వివాదానికి ముగింపు ప‌లక‌నున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *