Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు నమోదైంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నేతలు మంగళవారం కమిషన్‌కు ఫిర్యాదు సమర్పించారు.
సహచర మంత్రి అన్న గౌరవం లేకుండా, ప్రజా వేదికపై ఉన్నామనే అవగాహన లేకుండా మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి లక్ష్మణ్‌ను దూషించడం తీవ్రంగా ఖండనీయమని సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక వర్గాల మధ్య విభేదాలను రగదీయగలవని, ప్రజా ప్రతినిధులు మరింత జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.
పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా స్వీకరించి వెంటనే అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని, అలాగే ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కమిషన్ స్పందన ఎలా ఉంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.