Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం

Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని బూత్ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నేతలతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ గెలుపు కోసం శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరిగా ఉన్నా, పార్టీ విజయం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

ఎర్రగడ్డ డివిజన్‌లో బూత్ కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మంత్రులు సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే, అది రాష్ట్ర అభివృద్ధికి సంకేతమవుతుందని మంత్రులు స్పష్టం చేశారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Adilabad: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురి మృతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *