Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఎవరికీ నష్టం కలగదని ఆయన స్పష్టం చేస్తూ, 50 శాతం రిజర్వేషన్ పరిమితి గురించి కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అవసరమైతే రాజ్యాంగం మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని గుర్తుచేశారు.
బీసీల రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం న్యాయపరంగా, చట్టపరంగా ముందుకు వెళ్తుందని, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు మాట మార్చకుండా అందరూ సహకరిస్తే, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు సాఫల్యవంతంగా జరుగుతుందని, అవసరమైతే ఈ విషయాన్ని న్యాయస్థానంలో కూడా సమర్థంగా వాదిస్తామని మంత్రి స్పష్టం చేశారు.