Ponguleti Srinivas Reddy:తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైఖరిలో మార్పు తెచ్చుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించినట్టు సమాచారం. అధికారులు, తోటి ఎమ్మెల్యేలతో సమన్వయం లోపిస్తున్నదని హెచ్చరించినట్టు తెలిసింది. ఢిల్లీలో తాజాగా జరిగిన ఆ ఇద్దరి భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చిన ఫిర్యాదులపై పొంగులేటిపై ఖర్గే సీరియస్ అయ్యారని తెలిసింది.
Ponguleti Srinivas Reddy:మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైఖరి నచ్చక కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి ఇటీవల ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా ప్రభుత్వ అంశాలను ఏకపక్షంగా మంత్రి పొంగులేటి ప్రకటనలపై ఖర్గేకు ఫిర్యాదులు అందాయి.
Ponguleti Srinivas Reddy:ఉదాహరణకు త్వరలో బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గతంలో ప్రకటించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ రెండు అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్ సహా అధిష్టానం కూడా సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఆయా అంశాలతోపాటు ప్రభుత్వానికి సంబంధించి అంశాలను వ్యక్తిగతంగా ప్రకటించవద్దని పొంగులేటిని ఖర్గే హెచ్చరించారని తెలిసింది.
Ponguleti Srinivas Reddy:బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మల్లికార్జున ఖర్గే చెప్పినట్టు తెలిసింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తోటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమన్వయంగా ఉండాలని ఖర్గే సూచిచినట్టు సమాచారం.
Ponguleti Srinivas Reddy:ఇదిలా ఉండగా, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా సీరియస్ అయ్యారు. క్యాబినెట్‌లో చర్చించి, వెల్లడించాల్సిన అంశాలను ముందే ఎలా లీక్ చేస్తారని మండిపడ్డారు. మరో మంత్రి శాఖ పరిధిలోని అంశాలను వేరే మంత్రి ఎలా ప్రకటిస్తారని కూడా రుసరుసలాడినట్టు తెలిసింది. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న సున్నిత, కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించినట్టు తెలిసింది.