Ponguleti srinivas: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా వచ్చే మూడున్నరేళ్లలో 20 లక్షల ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. అవసరమైతే తల తాకట్టు పెట్టైనా ఈ లక్ష్యాన్ని సాధిస్తాం అని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాకే మళ్లీ ప్రజల ముందుకు ఓట్లు అడగడానికి వస్తామని చెప్పారు.
మొదటి విడత వివరాలు:
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు
మొత్తం 4.5 లక్షల ఇళ్లకు ₹22,500 కోట్లు కేటాయింపు
ఇప్పటివరకు 2.65 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు
71 వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభం, వాటిలో 3 వేల ఇళ్లు గోడలు, శ్లాబ్ దశలో ఉన్నాయి
దరఖాస్తుల స్థితి:
మొత్తం వచ్చిన దరఖాస్తులు: 18 లక్షలు
మంజూరు చేయనున్న ఇళ్లు: 16.5 లక్షలు
ఇళ్ల పరిమాణం:
400 నుంచి 600 చదరపు అడుగులలో నిర్మాణం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు.
లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.