Ponglueti srinivas: గ్రామాలల్లో భూధర్ కార్డుల పంపిణీ త్వరలో ప్రారంభం కానున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాక భూధర్ కార్డులు అందించే ప్రక్రియ చేపడతామని ఆయన చెప్పారు.
సమగ్ర సర్వే పూర్తయ్యాక భూములను రికార్డుల్లోకి ఎక్కించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 111 జీవో పరిధిలో ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని, ఆ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని ఆయన తెలిపారు.
తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. అవి పూర్తిగా అవాస్తవమని, నిజం కాలుగడచిన తర్వాత బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు.

