Ponglueti srinivas: మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ను దీవించాలని ప్రజలను కోరారు. ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం తన బాధ్యతగా పేర్కొన్నారు. తాను ప్రజల ఇంటి పెద్దకొడుకులా పనిచేస్తానని తెలిపారు. వరదల వంటి విషయంలో కూడా బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని, అదే ప్రభుత్వంలో కూలిపోయిందని గుర్తు చేశారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చిస్తే తప్పేముందని ప్రశ్నించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి బీఆర్ఎస్కు ఏమాత్రం అర్హత లేదని వ్యాఖ్యానించారు. భట్టి విక్రమార్కకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వని రోజులు గుర్తుచేస్తూ, బీఆర్ఎస్ రౌడీయిజం, గుండాయిజం మాత్రమే చేయగలదని మంత్రి పొంగులేటి తీవ్రంగా విమర్శించారు.

