Manchu Manoj: ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో దివంగత భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డిలకు మంచి పట్టు ఉంది. వీరిద్దరి మరణాంతరం రాజకీయ వారసత్వాన్ని భూమా అఖిలప్రియ తీసుకున్నారు. ప్రస్తుతం భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి రెండో కుమార్తె అయిన మౌనిక కూడా రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారని టాక్ నడుస్తోంది.
గతంలో నంద్యాల ఎన్నికల్లో భూమా మౌనిక తన అన్న భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారు. ఆ అనుభవంతో ఇప్పుడు రాజకీయాల్లో వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత రాజకీయాలకు దూరమైన ఆమె…ఇప్పుడు మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అక్క భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేస్తారని ప్రచారం జోరు అందుకుంది.
Manchu Manoj: భూమా శోభ నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఇవాళ ఆళ్లగడ్డకు భూమా మౌనిక, మంచు మనోజ్ దంపతులు వచ్చి ఆళ్లగడ్డలో కీలక ప్రకటన చేస్తారని వార్త సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. భూమా ఘాట్ నుంచి రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేస్తారని ప్రచారం జరిగింది. అయితే భూమా మౌనిక, మంచు మనోజ్, భూమా శోభ నాగిరెడ్డికి నివాళులర్పించి నేరుగా భూమా అఖిలప్రియ ఇంటికి వెళ్లిపోయారు. ఇదంతా మంచు ఫ్యామిలీ వ్యవహారాలు కొత్త టర్న్ తీసుకోనున్నాయనీ ప్రచారం ఊపందుకుంది. గత వారం రోజులుగా మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలతో రాజకీయంగా బలపడాలని మంచు మనోజ్, భూమా మౌనిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
భూమా ఫ్యామిలీకి మెగా కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేనలోకి భూమా మౌనిక, మంచు మనోజ్ వెళ్ళతారని వాళ్ళ అభిమానులు భావిస్తున్నారు. అయితే భూమా మౌనిక, మంచు మనోజ్ దంపతులు మాత్రం ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నంద్యాల జిల్లా నుంచి పొలిటికల్ చేస్తారా లేక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి జనసేన కండువా కప్పుకుంటారనేది మాత్రం సస్పెన్షన్‌గా కొనసాగుతుంది. ఏది ఏమైనా త్వరలో మంచు మనోజ్, మౌనిక నిర్ణయంతో ఏపీ రాజకీయాల్లో అలజడి సృష్టించే అవకాశం ఉందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భూమా మౌనిక, మంచు మనోజ్ నిర్ణయంపై ఇటు రాజకీయ పార్టీల్లో అటు సినీ ఇండస్ట్రీలో చర్చ మొదలైందని చెప్పొచ్చు…