టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. జానీకి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ నార్సింగి పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.
అక్టోబర్ 8న న్యూఢిల్లీలో జరిగే ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో జానీ మాస్టర్ అవార్డును అందుకోవలసి ఉంది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు జానీకి కోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది.
అయితే కేసులో అభియోగాలు ఎదురుకుంటున్న వ్యక్తికి నేషనల్ అవార్డు ఇవ్వొద్దంటూ పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అవార్డును రద్దు చేస్తూ అవార్డు కమిటీ నిర్ణయం తీసుకుంది.

