Guntur: ఘాటైన జిల్లాలో..స్వీటైన అమ్మాయిలు. మిరపకాయ మంటలతో మండిపోయే అక్కడ…పాలరాతి బొమ్మలాంటి అమ్మాయిలను దింపారు. ఏ బార్ ఆజా అంటూ…అక్కడికి పిలిచారు. అలా ఒన్స్ అక్కడికి వస్తే చాలు…ఎవరీ డే అక్కడికి రావాలి అనేలా లాగుతుంది. అలా ఉంటుంది అక్కడ ట్రీట్మెంట్ . ఎదో అలా అలా కాలం గడుపుతున్న ఆ అమ్మాయిలు చివరకు ఇదిగో ఇలా దొరికిపోయారు.
గుంటూరు నగరంలో మరో కొత్త దందా వెలుగులోకి వచ్చింది. స్పా సెంటర్ల పేరుతో కొందరు గలీజు పనులు చేయిస్తున్నారు. మసాజ్ పేరుతో వ్యభిచారం నడిపిస్తున్నారు. తాజాగా పలు స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఆశ్చర్యకరమైన దృశ్యాలు కనిపించాయి. అటు ఈ వ్యవహారం వెనక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Guntur: గుంటూరు నగరంలోని స్పా సెంటర్లలో మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం వచ్చింది. స్పా సెంటర్లపై అనుమానాలు రావడంతో.. పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో పలు స్పా సెంటర్లలో థాయ్‌లాండ్‌కు చెందిన యువతులు పట్టుబడ్డారు.
పట్టాభిపురం, అరండల్‌పేట పోలీస్ స్టేషన్ల పరిధిలోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే.. పోలీసుల దాడుల గురించి ముందే తెలుసుకున్న స్పా సెంటర్ల నిర్వాహాకులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.లక్ష్మీపురంలోని తురా స్పా సెంటర్లో తనిఖీలు చేసిన పోలీసులు.. అక్కడి దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. తురా స్పా సెంటర్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు పట్టుబడ్డారు. వీరిలో నలుగురు థాయ్‌లాండ్‌కు చెందిన మహిళలు ఉన్నారు.
Guntur: స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని యజమాని, మేనేజర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.మరో స్పా సెంటర్లో పోలీసులు దాడి చేసిన సమయంలో నలుగురు థాయ్‌లాండ్, ముగ్గురు పురుషులు ఉన్నారు. పలు స్పా సెంటర్లలో తనిఖీలు చేసిన పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిసింది. అయితే.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కేసులు నమోదు చేయలేదనే ప్రచారం జరుగుతోంది.ఈ స్పా సెంటర్లలో గలీజు పనుల వెనక రాజకీయ పార్టీల నేతలు ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వారి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్టు గుంటూరు కోడై కూస్తోంది.