PMO Renaming: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో మరో కీలక నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. బ్రిటీష్ వలసవాద పాలన గుర్తులను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో ప్రజాస్వామ్యాన్ని సూచించే పేర్లను ఆచరణలోకి తేవడమే లక్ష్యంగా కేంద్రం ఈ మార్పులు చేసింది. ఇందులో భాగంగా, ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పేరును ‘సేవాతీర్థ్’ గా మారుస్తూ కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాలుగా సౌత్‌బ్లాక్‌లోని పీఎంవో నుంచి విధులు నిర్వర్తిస్తున్న ప్రధానమంత్రుల కార్యాలయం, కొత్త భవనంలోకి మారుతున్న నేపథ్యంలోనే ఈ పేరు మార్పు ప్రకటన రావడం గమనార్హం.
Also Read: Rahul Gandhi: పాపం కుక్క ఏం చేసింది?
ఇదే క్రమంలో, దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లు కూడా మారాయి. ఇదివరకు ‘రాజ్‌భవన్’ పేరుతో కొనసాగుతోన్న ఆ నివాసాలను ఇకపై ‘లోక్‌భవన్’ గా మార్చాలని కేంద్రం సూచించింది. కేంద్రం నుంచి పేరు మార్పు ఉత్తర్వులు అందగానే, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, గుజరాత్ వంటి పలు రాష్ట్రాలు వెంటనే స్పందించాయి. డిసెంబర్ 1 నుంచే తమ సైన్‌బోర్డులు, అధికారిక వెబ్‌సైట్లు, లెటర్‌హెడ్‌లలో పేరు మార్పును అమలు చేశాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకించాయి. రాష్ట్రాల జోక్యం లేకుండా కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆ రాష్ట్రాలు మండిపడ్డాయి. ఏదేమైనా, పూర్వవాద పాలన గుర్తులను తొలగించే లక్ష్యంతో ఈ కొత్త పేర్లు ‘సేవాతీర్థ్’ మరియు ‘లోక్‌భవన్’ అధికారికంగా అమలులోకి వచ్చాయి.

