narendra modi

Narendra Modi: అమెరికా అధ్యక్షుడు బిడెన్ తో ప్రధాని మోదీ భేటీ

Narendra Modi: బ్రెజిల్‌లోని రియో ​​డి జెనీరోలో జరుగుతున్న 19వ జి20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా ఆయనకు స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌, ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియో గుటెరెస్‌లతోనూ మోదీ సమావేశమయ్యారు. బిడెన్‌ను కలవడం ఎప్పుడూ తనకు ఆనందంగా ఉంటుందని  ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లో వెల్లడించారు. 

బ్రెజిల్ రాజధాని రియో ​​డి జనీరోలో 19వ జి20 సదస్సు సోమవారం ప్రారంభమైంది. నవంబర్ 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు జీ20 సదస్సు జరగనుంది. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌లు పరస్పరం కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోనూ ప్రధాని మోదీ భేటీ కానున్నారు.

ఇది కూడా చదవండి: Kailash Gehlot: బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్

Narendra Modi: G20 సమ్మిట్  మొదటి సెషన్ థీమ్ ‘ఆకలి – పేదరికానికి వ్యతిరేకంగా సంఘీభావం’. మొదటి సెషన్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ, G20 విజయవంతంగా నిర్వహించినందుకు బ్రెజిల్ అధ్యక్షుడిని అభినందించారు. బ్రెజిల్ అధ్యక్షతన న్యూఢిల్లీ సమ్మిట్‌లో తీసుకున్న నిర్ణయాలను బ్రెజిల్ ముందుకు తీసుకువెళ్లిందన్నారు.

narendra modi

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pakistan: పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *