PM Kisan yojana:

PM Kisan yojana: 21వ విడ‌త పీఎం కిసాన్ నిధుల విడుద‌ల‌పై కీల‌క‌ అప్‌డేట్‌!

PM Kisan yojana:దేశ‌వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతాంగానికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి సూచ‌న‌ప్రాయంగా శుభ‌వార్త అయితే అందింది. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న 21వ విడ‌త నిధుల విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం అందింది. 2025 న‌వంబంర్ నెలలో తొలి ప‌క్షంలోపే ఆ నిధుల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఇప్ప‌టికే అర్హులైన రైతుల జాబితాను పున‌రుద్ధ‌రించిన‌ట్టు తెలుస్తున్న‌ది.

PM Kisan yojana:ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న కింద దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మంది అర్హులైన రైతుల‌కు రూ.2,000 చొప్పున ఆర్థిక‌సాయాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అందించ‌నున్న‌ది. ఈ ప‌థ‌కం కింద అర్హ‌త క‌లిగిన రైతుల‌కు ప్ర‌తి ఏటా రూ.6,000 చొప్పున ఆర్థిక‌సాయం అంద‌జేస్తున్న‌ది. దీనిని మూడు విడ‌త‌లుగా అంద‌జేస్తున్న‌ది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్ (డీబీటీ) వ్య‌వ‌స్థ ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల‌కు నేరుగా న‌గ‌దును జ‌మ చేస్తున్నారు.

PM Kisan yojana:తాజాగా న‌వంబ‌ర్ మొద‌టి లేదా రెండో వారంలో 21వ విడ‌త రూ.2,000 న‌గ‌దు సాయాన్ని రైతుల ఖాతాల్లో కేంద్ర ప్ర‌భుత్వం జ‌మ చేయ‌నున్న‌ట్టు తెలిపింది. కొంద‌రు అన‌ర్హుల‌ను కేంద్రం ప్ర‌భుత్వం ఇటీవ‌ల గుర్తించింది. ఒకే కుటుంబంలో ఇద్ద‌రికి కూడా న‌గ‌దు సాయం అంద‌డంపై ఆరా తీసింది. ప్ర‌త్యేక బృందాల‌ను పంపి నేరుగా విచార‌ణ జ‌రిపించింది. ఈ మేర‌కు ల‌క్ష‌లాది కుటుంబాల్లో అన‌ర్హుల‌ను గుర్తించిన‌ట్టు తేలింది. దీంతో ఆ మిగ‌తా అర్హుల ఖాతాల్లో ఈ విడ‌త నిధుల‌ను జ‌మ చేయ‌నున్న‌ట్టు తెలుస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *