Fact Check

Fact Check: భారత క్రికెటర్ రింకూ సింగ్, షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఒకే హోటల్ లో ఉన్నారా? ఎఐ చేసిన రచ్చ చూడండి..!

Fact Check: సోషల్ మీడియాలో అనేక రకాల వదంతులు, అబద్ధ వార్తలు వ్యాప్తి చెందుతుంటాయి. ఒక వ్యక్తిని, పార్టీని లేదా వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తారు. ఈ క్రమంలో అత్యంత సంచలనమైన పోస్టులు ట్విట్టర్ వంటి మాధ్యమాల ద్వారా బయటకి వస్తుంటాయి. అలాంటి పోస్టుల్లో భాగంగా బాలీవుడ్ నటి సుహానా ఖాన్, క్రికెటర్ రింకూ సింగ్ తో కలిసి యూకేలో ఒక హోటల్‌లో గడిపినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు.

బాలీవుడ్ నటి సుహానా ఖాన్, క్రికెటర్ రింకూ సింగ్ కలిసి యూకేలో ఓ హోటల్ గదిలో ఉన్నట్లు – జనవరి 19న ‘నాగ్ పురి నాగ్ పురి’ అనే ఫేస్‌బుక్ యూజర్ ఆ పోస్టు చేసి ఫోటో షేర్ చేశాడు. అయితే ఒక ప్రముఖ మీడియా సంస్థ దర్యాప్తులో ఇవన్నీ నకిలీ ఫోటోలని తేలింది. కొందరు ఇలాంటి ఫోటోలు నిజమైనవి కావో నకిలీ కావో తెలుసుకోకుండానే షేర్ చేస్తుంటారు. కానీ నిజానిజాలు మాత్రం వెంటనే బట్టబయలు అవుతుంటాయి.

అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఒక యూజర్ పోస్ట్ చేసిన ఫోటోలను నిజమా కాదా అని నిర్ధారించుకోకుండానే పబ్లిసిటీ కోసం మరి కొందరు ఫేస్‌బుక్ యూజర్లు కూడా ఇదే రకమైన వ్యాఖ్యలతో మరి కొన్ని ఫోటోలు షేర్ చేస్తారు. అలాగే మరి కొందరు యూజర్లు సుహానా ఖాన్, రింకూ సింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Suresh Raina: కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించిన సురేష్ రైనా..!

Fact Check: ఈ ఫోటోల నిజానిజాలను తెలుసుకోవడానికి ముందుగా ఆ ప్రముఖ మీడియా సంస్థ సుహానా ఖాన్, రింకూ సింగ్ పేర్లతో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి వార్తలు, నివేదికలు కనిపించలేదు. ఈ ఫోటోలు చూస్తున్నప్పుడే ఎఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించినట్లు అనిపించడంతో ఫేస్బుక్ లోని ఆ ఫోటోలను డీకాపీ. ఎఐ లో అప్లోడ్ చేశారు.

దీంతో హైవ్ మోడరేషన్ ద్వారా కూడా ఈ ఫోటోలు ఎక్కడినుండి వచ్చాయి అన్నది కనుగొన్నారు. ఫలితంగా ఇవన్నీ ఎఐ తో రూపొందించిన ఫోటోలని నిర్ధారించుకున్నారు. కనుక సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సుహానా ఖాన్, రింకూ సింగ్ ఫోటోలు నకిలీవని తేలిపోయింది.

ఇక టీమిండియా యువ క్రీడాకారుడు రింకూ సింగ్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో త్వరలో పెళ్లి జరగనుంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వీరిద్దరికీ ఏడాది కాలంగా పరిచయం ఉన్నట్లు కొన్ని వార్తా కధనాల్లో పేర్కొన్నారు. రింకూ సింగ్, ప్రియాకు పెళ్లి నిశ్చయం చేశామని, ముహూర్తం మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని ఎంపీ ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *