Mushrooms: మష్రూమ్ ఒక సూపర్ ఫుడ్. చాలా మంది పుట్టగొడుగులను తినడానికి ఇష్టపడతారు. దీని ధర కాస్త ఎక్కువగానే ఉన్నా.. పోషకాహారానికి లోటు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో మష్రూమ్ తినడం చాలా మంచిది. మష్రూమ్ తింటే శరీరానికి అవసరమైన పొటాషియం, కాపర్, విటమిన్లు, ఐరన్, సెలీనియం అందుతాయి. పుట్టగొడుగులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, కొంతమందికి మేలు కంటే ఎక్కువ హాని చేస్తుందని మీకు తెలుసా? అవును శరీరంలో కొన్ని సమస్యలుంటే పుట్టగొడుగులను తింటే ఆ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి పుట్టగొడుగులను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సమస్యతో ఉన్నవాళ్లు పుట్టగొడుగులను తినవద్దు:
మలబద్ధకం: మలబద్ధకంతో బాధపడేవారు పుట్టగొడుగులను తినడం మానేయాలి. ఎందుకంటే అది సమస్యను మరింత పెంచుతుంది. ఒకవేళ అలాగే తింటే కడుపునొప్పి, మలబద్ధకం, వాంతులు, విరేచనాలు సంభవించవచ్చు.
చర్మ సమస్య: పుట్టగొడుగులను తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయన్నది నిజం. అయితే చర్మ సమస్యలుంటే పుట్టగొడుగులను తినకుండా ఉండటం మంచిది. లేకపోతే చికాకుతో పాటు, అలెర్జీ రావొచ్చు.
ఇది కూడా చదవండి: Pregnancy Problems: మహిళల్లో సంతానలేమి సమస్యలు . . కారణాలు ఇవే కావచ్చు . .
అలసట: మీకు తరచుగా అలసటగా అనిపిస్తే పుట్టగొడుగులను ఎక్కువగా తినొద్దు. ఒకవేళ తింటే శక్తి లోపంతో బాధపడతారు.
అలెర్జీ: అలెర్జీ సమస్య ఉన్నవారు పుట్టగొడుగులను తినకుండా ఉండాలి. లేకపోతే దురద, శ్వాస సమస్యలు వస్తాయి.
ఆర్థరైటిస్ & కిడ్నీ స్టోన్: ఫంగల్ ఆర్థరైటిస్, కిడ్నీ స్టోన్ సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగులను తినొద్దు. ఎందుకంటే పుట్టగొడుగుల్లో ఉండే యూరిక్ యాసిడ్ ఈ సమస్యను పెంచుతుంది. కాబట్టి ఈ రెండు సమస్యలున్నవాళ్లు పుట్టగొడుగులను తినకూడదు.
గర్భిణీ స్త్రీలు: గర్భిణీ స్త్రీలు పుట్టగొడుగులను తినకూడదు. ఇది తింటే గర్భిణీ స్త్రీకి మరియు శిశువుకు ప్రమాదం.
ప్రేగు సమస్య: ఏదైనా ప్రేగు సమస్య ఉంటే పుట్టగొడుగులు తినడం మానేయాలి. లేదంటే పేగు ఉబ్బరం, గ్యాస్ సమస్య పెరుగుతుంది.
కాలేయ సమస్య: కొన్ని కాలేలో కాలేయాన్ని దెబ్బతీసే టాక్సిన్స్ ఉంటాయి. కాబట్టి కాలేయ సమస్య ఉన్నట్లయితే పుట్టగొడుగులు తినకుండా ఉండటం మంచిది.