Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ ప్రయాణంలో కొత్త రికార్డ్ సృష్టించే దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘ఓజి’ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన, ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ‘గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Allu Arjun-Atlee: అల్లు అర్జున్-అట్లీ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్!
Pawan Kalyan: అయితే, ఈ సినిమా గురించి సినీ వర్గాల్లో ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం పవన్ కళ్యాణ్‌కు మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా రూ.170 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమైతే, టాలీవుడ్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా పవన్ రికార్డ్ సృష్టించనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి, రిలీజ్ అయ్యే వరకు ఈ వార్తల్లో నిజానిజాలు తేలనున్నాయి. పవన్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి!

