Pawan Kalyan

Pawan Kalyan: హరిహర వీరమల్లు ట్రైలర్ ఫీవర్.. పవన్ రియాక్షన్ వైరల్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ పట్ల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా జూలై 3న థియేటర్లలో గ్రాండ్‌గా ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్‌ను ఇప్పటికే చూసిన పవన్, కొన్ని మార్పులు సూచించగా, లేటెస్ట్ వెర్షన్‌తో సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారని సమాచారం.

Also Read: Allu Arjun-Neel: అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ భారీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్!

థియేటర్ స్క్రీనింగ్‌లో పవన్ రియాక్షన్‌ను చూసిన అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. చిత్ర యూనిట్‌తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ట్రైలర్ విజువల్స్‌పై హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది. ట్రైలర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kodali Nani Court Violation: కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి.. గుడివాడ పీఎస్‌కు వెళ్లిన కొడాలి నాని..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *