Pawan Kalyan:

Pawan Kalyan: త‌న‌యుడు మార్క్ శంక‌ర్‌తో హైద‌రాబాద్ వ‌చ్చిన ప‌వ‌న్ దంప‌తులు

Pawan Kalyan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, అన్నా లెజినోవా దంప‌తులు త‌మ‌ చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్‌తో క‌లిసి హైద‌రాబాద్ చేరుకున్నారు. ఇటీవ‌ల సింగ‌పూర్‌లోని మార్క్ శంక‌ర్ చ‌దువుకుంటున్న స్కూల్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఆ బాలుడికి గాయాల‌య్యాయి. ఊపిరి తిత్తుల్లోకి పొగ చేర‌గా, కాలికి, చేతికి గాయాల‌వ‌డంతో అక్కడే ఆసుప‌త్రిలో చికిత్స అందించారు.

Pawan Kalyan: ఘ‌ట‌న విష‌యం తెలిసిన వెంట‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ దంప‌తులు, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంప‌తులు సింగ‌పూర్ వెళ్లారు. ఆసుప‌త్రిలో బాలుడు మార్క్ శంక‌ర్ కోలుకున్న వ‌ర‌కు అక్క‌డే ఉన్నారు. బాలుడిని ప‌రామర్శించిన త‌ర్వాత చిరంజీవి, సురేఖ దంప‌తులు ఇప్ప‌టికే చేరుకోగా, ప‌వ‌న్‌, అన్నా లెజినోవా దంప‌తులు ఈరోజే శంషాబాద్ విమానాశ్ర‌యం చేరుకున్నారు.

Pawan Kalyan: శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో విమానం దిగాక‌ మార్క్ శంక‌ర్‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఎత్తుకొని ఎస్క‌లేట‌ర్ దిగి వ‌స్తున్న వీడియో ఆస‌క్తిక‌రంగా క‌నిపించింది. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ కుటుంబ స‌భ్యులు, జ‌న‌సేన శ్రేణులు, మెగా అభిమానులు హ్యాపీగా ఫీల‌వుతున్నారు. మార్క్ శంక‌ర్ ఆసుప‌త్రిలో ఉండ‌గా, అత‌ను కోలుకోవాల‌ని అభిమానులు, జ‌న‌సేన శ్రేణులు పూజా కార్య‌క్ర‌మాలు, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. మార్క్ శంక‌ర్ సేఫ్ అంటూ వారంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *