OG vs Akhanda 2: ఈ దసరా తెలుగు సినిమా బాక్సాఫీస్ వేదికగా మరోసారి హై వోల్టేజ్ యుద్ధానికి సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న OG సినిమా, మరోవైపు నటసింహం బాలకృష్ణ అభిమానులను ఉర్రూతలూగించే అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో గట్టిగా ఢీ కొట్టనున్నాయి. ఈ రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: Neel – NTR: ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్: టెంపుల్ సెట్‌లో ఇంటర్వెల్ మాస్ బ్లాక్‌బస్టర్!
OG vs Akhanda 2: రెండు చిత్రాలూ భారీ ఓపెనింగ్స్ సాధించే సత్తా ఉన్నప్పటికీ, ఒకే రోజు రిలీజ్ కావడంతో కలెక్షన్స్‌లో కొంత తగ్గుదల ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా, అభిమానుల మధ్య ఇప్పటి నుంచే ఉత్కంఠ మొదలైంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావుడి, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లతో రచ్చ మొదలైపోయింది. ఈ రేసులో ఎవరు ముందంజ వేస్తారు? ఎవరు బాక్సాఫీస్ రారాజుగా నిలుస్తారు? దసరా ఫలితమే ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది!