Amaravati: వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆస్తులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల పంపిణీ అంశానికి సంబంధించి విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్దం జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో మరో ఆసక్తికర పరిణామానికి దారి తీసింది.
Amaravati: పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు ఉన్న 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే వార్తలు వెలుగులోకి రావడం జరిగింది. దీంతో అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగానూ ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై స్పందించారు. సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో ఎంత విస్తీర్ణంలో అటవీ భూములు ఉన్నాయనే దానిపై వివరాలతో నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను, పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ అంశంపై అధికారులతో పవన్ చర్చించారు.
Also Read: Mahaa Vamsi Comment: పవర్ అక్రమాలు.. సరస్వతి పవర్ మూలాలు..ఆస్తి తగాదాల్లో బయటపడుతున్న నిజాలు
ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రభుత్వ భూములు, జల వనరులు, అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. ఆ సంస్థ భూముల్లో వాగులు, వంకలు, కొండలు ఉన్నందున పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారో కూడా తెలియజేయాలని పీసీబీని పవన్ ఆదేశించారు. ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో త్వరలో డిప్యూటీ సీఎం సమీక్షించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తాం: లోకేష్
మాజీ సీఎం ఆగన్ పై విమర్శలు చేశారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో విమర్శించారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కూడా చంద్రబాబునాయుడు గారు కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశారంటూ మాట్లాడారు.
ఇప్పుడు టీసీఎస్ విషయంలో జగన్ కు ఆత్మ చెప్పినట్లుంది.. ఆయనే తీసుకువచ్చాడని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఎన్ని ఉద్యోగాలు కల్పించారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 2014-19 మధ్య 44వేల పరిశ్రమల ఏర్పాటుతో పాటు 8 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు స్వయంగా వైసీపీ ప్రభుత్వమే శాసనమండలిలో ఊపుకున్నారాన్నారు. గతంలో జగన్ రెడ్డి తరిమివేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తామని తెలిపారు.
.