Mahaa Vamsi Comment

Mahaa Vamsi Comment: పవర్ అక్రమాలు.. సరస్వతి పవర్ మూలాలు..ఆస్తి తగాదాల్లో బయటపడుతున్న నిజాలు 

Mahaa Vamsi Comment: ఏ ఇంటిలో ఉండవు ఇలాంటి తగాదాలు? టీడీపీ రాజకీయం చేస్తోంది అంటూ గురివింద గింజలా మాట్లాడుతూ వస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆయన చెల్లెలు షర్మిల గట్టి షాక్ ఇచ్చారు. తన మీడియా ద్వారా ఆస్తుల వ్యవహారంలో షర్మిలపై బురద జల్లుతూ వస్తున్న జగన్ కు బహిరంగ లేఖతో గట్టి సమాధానం ఇచ్చారు షర్మిల. అసలు ఏమి జరిగింది.. తానెందుకు బయటకు రావాల్సి వచ్చింది అన్నీ వివరిస్తూ ఎవరి కొంగు చాటునో ఉండి తనను.. తన తల్లిని కోర్టుల కీడుస్తున్నారంటూ ఆ బహిరంగ లేఖలో విస్పష్టంగా పేర్కొంటూ జగన్ పై విరుచుకు పడ్డారు షర్మిల.. 

Mahaa Vamsi Comment: తనకు.. జగన్ కు మధ్య విబేధాలు ఎందుకు వచ్చాయి? జగన్ తనకు చేసిన అన్యాయం ఏమిటి అనేది ఆ లేఖలో పేర్కొన్నారు షర్మిల. అధికారంలోకి రాకముందు.. అంటే వైసీపీ ఏర్పాటు చేసిన తరువాత తనను పెద్ద కూతురిగా చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే వేరుగా వెళ్లిపొమ్మని చెప్పారని వెల్లడించారు. సరే ఇదంతా పక్కన పెడితే, షర్మిల లెటర్ లోని అంశాల్లో ప్రస్తావించిన ఆస్తులు ఎలా వచ్చాయనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. 

Mahaa Vamsi Comment: దీనిలో సరస్వతి పవర్ విషయాన్ని పరిశీలిస్తే కనుక. ఇది అక్రమాల పవర్ ఇండస్ట్రీ అని అర్ధం అవుతుంది. సరస్వతి పవర్ కు లైమ్ స్టోన్ లీజ్ ను అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మంజూరు చేశారు. అయితే, లీజ్ షరతులను ఏమాత్రం పాటించలేదు సరస్వతి పవర్. దీనిపై 2012లో నోటీసులు ఇచ్చినా సరిగా స్పందించలేదు కంపెనీ. దీంతో 2014 లో చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్ లీజ్ రద్దు చేసింది. 

Mahaa Vamsi Comment: ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సరస్వతి పవర్  కోర్టుకు వెళ్ళింది. ఈలోపు ఏపీలో ప్రభుత్వం మారింది. జగన్ ప్రభుత్వం వచ్చింది. దీంతో జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్ లో మైనింగ్ లీజ్ ను పునరుద్ధరించారు. అంతేకాకుండా.. ఆ కంపెనీకి ఇచ్చిన లీజ్ కాలాన్ని 50 ఏళ్ళకు పెంచింది జగన్ ప్రభుత్వం. అలాగే హాఫ్ టీఎంసి కృష్ణా జలాలను సరస్వతి పవర్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతోపాటు.. గుంటూరు జిలా దాచేపల్లి లోని తంగెడ, మాచవరం లోని వేమవరం, చెన్నాయపాలెం లో 613.70 హెక్టార్లు-1,541 ఎకరాల మైనింగ్ లీజ్ సరస్వతి పవర్ కు ధారాదత్తం చేసింది వైసీపీ సర్కారు. మైనింగ్ రాయల్టీ టన్ను కు 45-50 రూపాయలు (గ్రేడ్ బట్టి) నిర్ణహించారు. దీనిపై సెస్ టన్ను కు 3 రూపాయలుగా ఉంది. ఇక లీజు ఫీజు తొలిరెండేళ్ళకు హెక్టారు కు 100 తరువాత 400 రూపాయలుగా నిర్ణయించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. 2012 వరకూ సిమెంట్ ప్లాంట్ కూడా పెట్ట లేదు.

ALSO READ  Kodali Nani: టీడీపీ వ్యూహాం... గుడివాడలో కొడాలి నాని అడ్రస్ గల్లంతేనా?

23,922 రూపాయల మినిరల్ రెవెన్యూ కూడా చెల్లించలేదు. షరతుల ఉల్లంఘన తో ఉమ్మడి రాష్ట్రంలోనే 2012 లో ఫిబ్రవరి, జూన్ లో 2 షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయినా.. ఈ కంపెనీకి వైసీపీ ప్రభుత్వం నిబంధనలు పక్కన పెట్టి వరాలు ప్రకటించింది. 

Mahaa Vamsi Comment: ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు. సరస్వతి పవర్ అనే కంపెనీకి వరాలు ఇస్తే.. జగన్ కి వచ్చే లాభం ఏమిటి? అని. అవును.. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఎవరిదో తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిల మధ్య ఆస్థి తగాదాలకు కారణమైన విషయాల్లో ఈ సరస్వతి పవర్ వాటాల విషయమే పెద్దది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏదైతే తన కష్టార్జితం అని జగన్ చెప్పుకుంటున్న సరస్వతి పవర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ. అంటే తన కంపెనీకి అడ్డుగోలుగా అనుమతులు.. ఇష్టారీతిన ప్రజల సొమ్మును పందేరం చేసి సరస్వతి పవర్ పేరున దాదాపుగా పదివేల కోట్ల రూపాయలను కొల్లగొట్టేశారు. 

Mahaa Vamsi Comment: ఇదొక్కటి చాలు వైఎస్ కుటుంబ అవినీతి ఆస్తుల చిట్టా ఎలా ఉంది అనేది అర్ధం చేసుకోవడానికి. నేను కష్టపడి సంపాదించాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పినా.. జగన్ కష్టపడి సంపాదించిన ఆస్తి షర్మిలకు ఎందుకు వాటా ఇవ్వాలని వైసీపీ వీరాభిమానులు ప్రశ్నించినా.. అదంతా ప్రజల సొమ్ము అనేది ముందుగా తెలుసుకోవాలి. ఎవరూ రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన ఆస్తులు కావు అవి అనే విషయాన్ని అందరూ అర్ధం చేసుకోవాల్సి ఉంది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *