Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఒకే సమయానికి తన కర్తవ్యాన్ని నిబద్ధతతో కొనసాగిస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
ఇటీవలి కాలంలో ‘అడవి తల్లి బాట’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా, అల్లూరి జిల్లాలోని పెదపాడు, కురిడి, డుంబ్రిగూడ వంటి అడవిపల్లెల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. అక్కడ వారి స్థితిగతులు చూసిన వెంటనే వెంటనే స్పందించి పాదరక్షలు పంపించారు. అంతేకాదు, తన తోటలో పండిన ఆర్గానిక్ పండ్లను పంపిస్తూ తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నారు.
ఇది కూడా చదవండి: ISRO: నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్
ఇటీవల మరొక మంచి పని చేశారు జనసేనాని. సాలూరు నియోజకవర్గంలోని ఏజెన్సీ గ్రామాలైన చిలక మెండంగి, తాడిప్యూట్టి, బెండ మెండింగి, డోయువరా బాగుజోల, సిరివర గ్రామాలకు చెందిన 222 గిరిజన కుటుంబాలకు రగ్గులు పంపించారు. ఈ రగ్గులను అందుకున్న గిరిజన మహిళలు పవన్ కళ్యాణ్ పై హర్షం వ్యక్తం చేశారు. ఈ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పనులు రాజకీయ ప్రచారానికి మించినవి. ప్రజల బాధలను తనవిగా భావించి, వెంటనే సహాయం చేయడం ప్రజానాయకునిగా ఉన్నతంగా నిలిచే లక్షణం. “పవర్ స్టార్” కంటే ముందు… “పీపుల్స్ స్టార్” పవన్ అని మరోసారి నిరూపించుకున్నారు.


