Pawan Kalyan: అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో పవన్‌ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: అధికారులతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తానే స్వయంగా ఫిర్యాదులను పరిశీలిస్తానని, ముఖ్యంగా భూదందాల బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తానని చెప్పారు.

ఇటీవలి పాలనపై మాట్లాడిన పవన్ కళ్యాణ్, కూటమి పాలన పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగుతోందని స్పష్టం చేశారు. అధికార వ్యవస్థ ప్రజలకు బాధలు కలిగిస్తే, బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. “ప్రజలను ఇబ్బంది పెట్టిన వారెవరైనా, వారు కూటమినేతలే అయినా ఉపేక్షించేది లేదు,” అంటూ ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పాలన పట్ల ఆయన తీసుకున్న నిష్ట, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. జిల్లాల పర్యటనల ద్వారా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, బాధితులకు న్యాయం చేయడం ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *