Pastor Praveen

Pastor Praveen: సెల్ఫ్‌ యాక్సిడెంట్‌లోనే పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి

Pastor Praveen: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతికి సంబంధించి నెలకొన్న అనుమానాలకు పోలీసులు తెరదించారు. ప్రత్యేక దర్యాప్తుతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్, పోస్ట్ మార్టం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికల సమగ్ర విశ్లేషణతో ఇది ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ అనే తేల్చారు.

బైక్ మీద ప్రయాణం – అనుకోని ముగింపు

హైదరాబాద్‌ నుంచి పాస్టర్ ప్రవీణ్ కుమార్ మార్చి 24న తన బుల్లెట్ బైక్‌పై రాజమండ్రికి బయలుదేరారు. ఈ ప్రయాణంలో మధ్యలో ఆయన మూడు చోట్ల మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తించారు. మార్గమధ్యంలో ఆరువురితో మాట్లాడినట్లు ఆధారాలున్నాయి. కీసర టోల్ ప్లాజా దగ్గర ఆయన అదుపు తప్పి పడిపోవడంతో, ఒక అంబులెన్స్‌ సిబ్బంది వెళ్లి సాయం అందించారు. రామవరప్పాడు వద్ద ఆటో డ్రైవర్ సూచనతో రెండు గంటలు పార్కులో నిద్రపోయారు. అయినా శరీర పరిస్థితి బాగోలేకపోయినా, ప్రయాణం కొనసాగించారు.

ఇది కూడా చదవండి: Tirumala News: తిరుమ‌ల‌లో 14 మంది సిబ్బందిపై వేటు.. అదే ఘ‌ట‌న‌పై టీటీడీ చ‌ర్య‌లు

వేగం – మద్యం – ప్రమాదం

ఎలూరు డీఐజీ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాద సమయంలో ప్రవీణ్ బైక్ 70 కి.మీ వేగంతో నాల్గో గేరులో ప్రయాణిస్తుండగా, కొంతమూరు వద్ద రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో బైక్ కంకర రాళ్లపై స్లిప్ అయింది. బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న అర్ధచంద్రాకార గుంతలో పడిపోయింది. గుంత ఆకారం కారణంగా బైక్ ఎగిరి ఆయన మీద పడింది. తలకు బలమైన గాయంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

పరిశీలనతో కూడిన పరిశోధన

ఈ కేసుపై అనేక వదంతులు, అనుమానాలు వ్యాప్తి చెందడంతో పోలీసులు 92 మంది సాక్షులను విచారించారు. సీసీటీవీ ఫుటేజ్‌ సేకరించి, ఫోరెన్సిక్ నివేదికను విశ్లేషించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్ ప్రకారం, ప్రవీణ్‌ మద్యం తాగిన త్రేణిలో ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా మృతిపై ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని డీఐజీ తెలిపారు.

వదంతులకు చెక్

పాస్టర్ ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పోలీసులు ఖండించారు. హత్య అనేది నిరాధారంగా తేలినట్లు స్పష్టం చేశారు. ఇటువంటి దుష్ప్రచారాలు చేసినవారిపై చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *